Ad column

header ads

Covid-19 Corona / కోవిద్ -19 కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం



Covid-19 Corona  /// కోవిద్ -19 కరోనా

చైనా చేతులెత్తేసింది , కరోనా 109 దేశాలూ దాటెళ్ళింది, చైనా స్టేట్మెంట్ ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా 60% కి చేరుకుంటుంది
నిజానికి కారో కి మనుషులను చంపే ఎంత శక్తి లేదు, కానీ ఇదివరకే ఏదైనా అనారోగ్యం తో బాధపడే వారికీ లేదా ఏదైనా శారీరక సమస్యలు ఉన్న కారణం చేతనే మరణాలు సంభవిస్తాయి . అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అన్నమాట. వైరస్ తాలూకు మరణించిన వారిని గమనిస్తే ముఖ్యంగా  60 ఏళ్ళ పైబడ్డ వారే అత్యతిదకంగా మరణించారు. ఇది కేవలం 3.5% నుండి 4% వరకు మాత్రమే  మరణ నిష్పత్తిని కలిగి ఉంది. అంటే ప్రతి 100 మంది లో కేవలం ముగ్గురు లేదా నలుగురు చనిపోయే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యాంగా ఉన్నట్లయితే వైరస్ సోకినా భయపడకండి . ఎందుకంటే వైరస్ కి మనిషిని చంపే శక్తి లేదు, కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే సరిపోతుంది. 

సంక్రమణ యొక్క సాధారణ లక్షణాలు:

ముక్కు దిబ్బడ, తీవ్రమైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ , జ్వరం, శ్వాస ఆడకపోవడం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. మరింత తీవ్రమైన సందర్భాల్లో, ఇన్ఫెక్షన్ న్యుమోనియా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మూత్రపిండాల వైఫల్యం .

మందులు మరియు నివారణ :

1.      దయచేసి గమనించండి వైరస్ చికిత్సకు ఇప్పుడు టీకా అందుబాటులో లేనందున నివారణ చాలా ముఖ్యం.
2.      W.H.O సమాచారం ప్రకారం వైరస్ కి మందు కనుక్కోడానికి ఒక సంవత్సరం పడుతుందని అంచనా. కాబట్టి బూటకపు వార్తలను మరియు ఫార్వార్డ్ చేసిన సందేశాలను నమ్మవద్దు. అయితే ప్రస్తుతానికి చైనా ప్రభుత్వం నిర్దేశించిన FAVILAVIR అనే మందు క్లినికల్ ట్రయల్ ఆమోదం  పొందిందని  నివేదికలు చెబుతున్నాయి

వైరస్ వ్యాప్తి చెందకుండా , దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం :


1.      చైనా, దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, సింగపూర్ వంటి దేశాలకు మీ ప్రయాణాలను రద్దు చేసుకోండి
2.      వీలైతే  పైన  పేర్కొన్న దేశాల నుండి విదేశీయులను లేదా అక్కడ నుండి తిరిగి వచ్చిన పర్యాటకులను కలవడం మానుకోండి
3.      షేక్ హ్యాండ్తో హలో చెప్పే బదులు రెండు చేతులు జోడించి నమస్తే చెప్పండి.
4.      జలుబు చేసిన వారినుండి, దగ్గుతున్న వారి నుండి దూరంగా నిల్చొని మాట్లాడండి, వీలైతే గాలి వచ్చే దిశా వైపుకు జరిగి నిలుచోండి
5.      బాధిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కనీసం 1.5 మీటర్ల దూరం లో నిల్చొని మాట్లాడండి.
6.      KOVID-19  వైరస్ సాధారణ జలుబు లాగానే వ్యాపిస్తుంది, అందువల్ల మిమ్మల్ని జలుబు నుండి రక్షించుకోండి
7.      ఎవరైనా దగ్గు లేదా తుమ్ముతు ఉంటె అది గాలి  లేదా తుంపర లేదా చేరువలో అనుకూలంగా ఉన్న మాధ్యమాల ద్వారా ఇతరులకు చేరుతుంది.
9.      సాధారణ జలుబు అయినప్పటికీ, జలుబు చేసిన వారినుండి, వ్యాధి సోకిన వ్యక్తుల నుండి తుంపర లేదా బిందువులను చేరుకోకుండా మిమ్మల్ని రక్షించుకోవడానికి చేతి రుమాలు, న్యాప్కిన్స్, మాస్క్లు లేదా కనీసం మీ మోచేయిని ఉపయోగించండి.
8.      శీతల పానీయాలుఐస్ క్రీమ్స్పేస్ట్రీలుమొదలైనవాటినుండి వీలైనంతగా దూరంగానే ఉండండి ఇవి సాధారణంగా గొంతు ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయిఇంకా వైరస్ సోకడానికి అనుకులంగా ఉంటుంది.
10. ముక్కు మరియు కళ్ళను వేళ్ళతో నేరుగా ముట్టుకోవడం . రుద్దుకోవడం ,లేదా నలపడం లాంటివి చేయకండి. ఎందుకంటే వైరస్ ముక్కు మరియు కళ్ళతో త్వరగా సోకుతుంది.
11.  వీలైనప్పుడల్లా సబ్బుతో కానీ, లిక్విడ్ హ్యాండ్ వాష్ తో గాని  చేతులు శుభ్రం చేసుకోండి.
12. ముఖ్యంగా ప్రజా రవాణాను (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్) ప్రయాణం తరువాత వెంటనే శానిటైజర్ వాడండి. పాకెట్ / జేబులో ఇమిడేంత సైజు లో కూడా శానిటైజర్ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి.
13. మీరు తరచుగా వాడే ఎలక్ట్రానిక్ పరికరాలు  మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్, రిమోట్ కంట్రోల్, కార్ స్టీరింగ్ , బైక్ హేండిల్ , హెల్మెట్ ఇలా తరచూ చేయి తగిలే వస్తువులను వెట్ వైప్స్ లేదా ఏదైనా స్ప్రే రకం శానిటైజర్లను ఉపయోగించి ఎప్పటికప్పుడు  శుభ్రపరచండి.
14. సభలు, రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ సేపు ఉండొద్దు, ప్రజా రవాణా వంటి రద్దీ ప్రదేశాలను కొన్ని రోజులు నివారించండి. డ్యూటీ కారణంగా సాధ్య పడకపోతే పైన పేర్కొన్న విధంగా ముసుగులు లేదా పైన వివరించిన వాటిని ఉపయోగించి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
15. జంతువులు మరియు పక్షులతో దూరంగా ఉండండి.
16. మంచిగా వేడి చేసినవి, ఉడికించిన పదార్ధాలు మాత్రమే భోజనం లో తీసుకోండి .
17. చికెన్ , మటన్, చేపలు వంటివి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ,కానీ ముక్కలుగా కోసేటప్పుడు వాటిని తాకినా చేతులతో ముక్కు లేదా కళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితిలో తాకవద్దు
18. ఇంట్లో లేదా ఎక్కడైనా సరే మీ పర్సనల్ వస్తువములను ఎవరికీ పడితే వారికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి , ముఖ్యంగా చేతి రుమాలు, టవల్ , పెన్ , మొబైల్ లాంటివి
19. పంది మాంసం, గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు, పాములు, తేళ్లు, కోతులు, కప్పలు వంటి తినడానికే కాదు కనీసం చూడడానికి కూడా సాహసం చేయకండి. ఎందుకంటే చైనా లో ఇవే వైరస్ కి మూలం గా పరిగణించవచ్చు
20. రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి మార్గాలు వెదకండి. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఆకు కూరలు, పండ్లు, పాలు, గ్రుడ్లు, ఆపిల్ లాంటివి అధికంగా సేవించండి. నీరు అధికంగా తాగండి. అల్లం , నిమ్మ రసం లాంటివి ఎంతో మేలు చేస్తాయి.

Post a Comment

0 Comments

Featured

COVID-19 CORONA VIRUS Prevention methods